గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (12:20 IST)

కుమార్తెకు నిద్రమాత్రలు ఇచ్చి మత్తులోనే అత్యాచారం.. తండ్రి ఘాతుకం

మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. వయోబేధం లేకుండా అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇంటా బయటా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా ఓ మానవ మృగం... కామవాంఛను తన కూతురిపై తీర్చుకున్నాడు. తండ్రిననే బాధ్యత ఉందని మర్చిపోయి కన్నకూతురిపైనే ఏడాదిగా అత్యాచారం చేస్తూ సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు.
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం శివపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు. వీరి పెద్ద కుమార్తెకు 16 ఏళ్లు. భర్త ప్రవర్తన నచ్చక అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ముగ్గురు కూతుర్లతో కలిసి ఇతను ఉండేవాడు. 
 
భార్య దూరం కావడంతో తన కామవాంఛ తీర్చుకునేందుకు ఇతని దృష్టి పెద్దకుమార్తెపై పడింది. రోజూ రాత్రుళ్లు ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చి మత్తులో ఉండగా అత్యాచారం చేసేవాడు. ఏడాదిగా అకృత్యానికి పాల్పడుతూ దాన్ని వీడియో తీసి మిగిలిన ఇద్దరి పిల్లలకూ చూపిస్తూ వారినీ లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. దీంతో తండ్రిని చూస్తే రాక్షసుడిని చూసినట్టు కుమార్తెలు వణికిపోయేవారు. 
 
అయితే ఈ విషయాన్ని చిన్నకూతురు పనికి కుదిరిన యజమానులు కనిపెట్టడంతో పోలీసులకు రంగంలోకి దిగారు. దీంతో పోలీసులు పెద్ద కుమార్తెను విచారించి ఆమె చెప్పిన ఆధారాల మేరకు నిందితుడిని అరెస్టు చేశారు.