1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 అక్టోబరు 2019 (16:48 IST)

మహిళలకు అశ్లీల వీడియోలు.. ట్రాఫిక్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు

విధి నిర్వహణలో భాగంగా తనకు లభించిన మహిళ ఫోన్ నెంబర్లకు అశ్లీలవీడియోలు పోస్టు చేశాడు ఓ ట్రాఫిక్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్. కానీ బాధితులు నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఉన్నతాధికారులు అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం వేలూరు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో రాజామాణిక్యం అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వేలూరు, కాట్పాడి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ తనిఖీలు నిర్వహిస్తుంటారు. విధుల్లో భాగంగా దొరికిన మహిళల ఫోన్ నెంబర్లకు రాజామాణిక్యం అశ్లీల వీడియోలు పోస్టు చేస్తుంటాడు. ఫైన్‌ కట్టిన తర్వాత తమ నంబర్లకు అశ్లీల వీడియోలు రావడాన్ని గుర్తించిన కొందరు మహిళలు అనుమానంతో అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ని నడిరోడ్డుపైనే నిలదీశారు.
 
ఈ వాగ్వాదాన్ని కొందరు వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం పై అధికారుల వరకు వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన వేలూరు డీఎస్పీ బాలకృష్ణన్‌ మహిళల ఆరోపణలు నిజమేనని నిర్థారణకు వచ్చారు. దీంతో రాజామాణిక్యంపై సస్పెన్షన్‌ వేటు వేశారు.