సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (19:24 IST)

కరోనా కష్టకాలంలోనూ గుట్టుగా వ్యభిచారం

కరోనా కష్టకాలంలోనూ గుట్టుగా వ్యభిచార దందా సాగుతోంది. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈ వ్యభిచార దందా కొనసాగుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయావాడ, ఆటోనగర్‌లో మదిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి (40) అనే వ్యక్తి ఓ లాడ్జీని నడుపుతున్నారు. ఈ లాడ్జీలో గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు లాడ్జిలో ఆకస్మిక సోదాలు నిర్వహించి పలువురు మహిళలతో పాటు.. విటులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న రాఘవేందర్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
అలాగే, హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన తిమ్మాపురం గ్రామ పంచాయతీ అవంతి నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార దందాను తిమ్మాపురం పోలీసులు రట్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, దుర్గాడకు చెందిన కొటికలపూడి రాజు, చీడిగ గ్రామానికి చెందిన వాసంశెట్టి ఇందిరా ప్రియదర్శిని కలిసి ఫ్యామిలీ పేరుతో అవంతి నగర్‌లో అద్దెకు ఇల్లు తీసుకున్నారు. 
 
గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన అప్పాజీ, బెంగళూరుకు చెందిన ఏజెంట్‌ రాజేష్‌ల ద్వారా అమ్మాయిలను రప్పించి గుట్టుగా వ్యభిచార దందా సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందే బెంగళూరు నుంచి రప్పించిన ఇద్దరు అమ్మాయిలను అడ్డం పెట్టుకుని కాకినాడ చుట్టుపక్కల వ్యక్తులను ఫోన్ల ద్వారా రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
 
దీనిపై సమాచారం అందడంతో సీఐ మురళీకృష్ణ, ఎస్సై విజయ్‌కుమార్, సిబ్బంది దాడి చేసి నిర్వాహకులను పట్టుకున్నారు. మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఇద్దరు బెంగళూరు అమ్మాయిలకు విముక్తి కల్పించారు.