గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 14 జనవరి 2018 (12:12 IST)

రూ.500 ఇస్తే చాలు.. మీరేమైనా చేసుకోవచ్చు.. రొమాన్స్ కేంద్రాలుగా పార్కులు

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ప్రధాన పార్కులు అసాంఘిక కార్యక్రమాలు అడ్డాలుగా మారాయి. ముఖ్యంగా, ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు, దుర్గం చెరువులు యువతీయువకులకు రొమాన్స్ కేంద్రాలుగా మారాయి.

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ప్రధాన పార్కులు అసాంఘిక కార్యక్రమాలు అడ్డాలుగా మారాయి. ముఖ్యంగా, ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు, దుర్గం చెరువులు యువతీయువకులకు రొమాన్స్ కేంద్రాలుగా మారాయి. వీరికి ఈ పార్కులకు కాపలాగా ఉండే సెక్యూరిటీ గార్డులు తమవంతు సాయం చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. 
 
ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలోనే కాకుండా శివారు ప్రాంతాల్లో ఉండే ఫామ్ హౌజ్‌లు హోటళ్ళు, రెస్టారెంట్లపై పోలీసుల నిఘా ఎక్కువైంది. దీంతో ప్రేమపక్షులు పార్కులు, చాటుగా ఉండే పొదలను ఆశ్రయిస్తున్నారు. అంటే ఈ పార్కులు రొమాన్స్ కేంద్రాలుగా మారాయి. సెక్యూరిటీ గార్డుల ప్రోత్సాహంతో సాయంత్రానికి ఎక్కడెక్కడి నుంచో ప్రేమ పక్షలు వాలిపోయి, సినిమాల్లో కనిపించని రొమాంటిక్ సీన్లను చూపిస్తున్నాయి.
 
వారి నుంచి చేతికి అందినంత డబ్బులు వసూలు చేస్తున్న సెక్యూరిటీ గార్డులు సీక్రెట్ ప్లేస్‌లను చూపిస్తున్నారు. ఎవరికీ కనిపించని పోదల మాటు ప్రాంతాన్ని చూపి, ఓ గంట పాటు అటు ఎవరినీ రాకుండా చూసుకోవాలంటే రూ.500, ఆపై చాటుగా ఉండే స్థలాలైతే రూ.50 నుంచి రూ.200 వరకూ సెక్యూరిటీ గార్డులు వసూలు చేస్తున్నారు. 
 
ముఖ్యంగా రెండు వైపులా రహదారి ఉండే వెంగళ్ రావు పార్కులో సాయంత్రమైతే వచ్చి చేరే యువతీ యువకులు, రాత్రి చీకటి పడే వరకూ అక్కడే ఉంటూ తమ కోర్కెలను తీర్చుకుని వెళుతుంటారు. కొందరు ప్రేమికులైతే రాత్రి 11 గంటల వరకూ కూడా పార్కులను వీడటం లేదు.