గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (09:37 IST)

కుమార్తెతో కామవాంఛ తీర్చుకుని ఆపై ఆత్మహత్య...

హైదరాబాద్ నగరంలో ఓ కన్నతండ్రి సభ్యసమాజం తలదించుకునే చర్యకు పాల్పడ్డాడు. కన్నబిడ్డపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తనకు కోర్టులో శిక్ష పడుతుందన్న భయంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని కార్వాన్ కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ జియాగూడలోని భాంజావాడికి చెందిన గణేష్ (40) అనే వ్యక్తికి భార్య ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. అయితే, గత 2017లో తన పెద్ద కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అపుడు ఆ బాలిక వయసు 13 యేళ్లు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేయగా కేసు విచారణ నాంపల్లిలోని 16వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సాగుతోంది. 
 
ఈ క్రమంలో ఈనెల 13వ తేదీన ఈ కేసు విచారణకు వచ్చింది. అపుడు తన కూతురుపై అత్యాచారానికి పాల్పడినట్లు న్యాయమూర్తి ముందు అంగీకరించాడు. అయితే విచారణ అనంతరం కోర్టు తీర్పు ఏవిధంగా ఉంటుందో అన్న భయంతో  గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గణేష్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.