శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 మే 2017 (11:46 IST)

పందికూర లేటుగా వండిందని.. కిరోసిన్ పోసి.. నిప్పంటించబోయాడు.. ఇంతలో?

పందికూర లేటుగా వండిన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.. ఓ కిరాతక భర్త. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు.. మారేడుపల్లిలోని రఘు, సుజాత దంపతులకు 22 ఏళ్ల క్రితం వివాహం జర

పందికూర లేటుగా వండిన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.. ఓ కిరాతక భర్త. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు.. మారేడుపల్లిలోని రఘు, సుజాత దంపతులకు 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. రఘు పందిమాంసం వ్యాపారం చేస్తున్నాడు. సుజాత కొన్ని ఇళ్ళల్లో వంటపని చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 11 గంటలకు ఇంటికొచ్చిన రఘు.. పందిమాంసంతో వంట చేయమన్నాడు. 
 
కానీ వంట ఆలస్యమైంది. దీంతో కోపంతో ఊగిపోయిన రఘు.. ఆమెపై కిరోసిన్ పోసి.. నిప్పంటించబోయాడు. కానీ చాలా తెలివిగా అతని బారి నుంచి తప్పించుకున్న సుజాత మారేడ్ పల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.