గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 4 జనవరి 2018 (15:29 IST)

పవన్ కళ్యాణ్‌ ఎలా వుంటాడో నేరుగా నేను చూడలేదు: ముద్రగడ(వీడియో)

పవన్ కళ్యాణ్‌‌ను ఇప్పటివరకూ తను ఎదురుగా చూడలేదన్నారు కాపు నేత ముద్రగడ పద్మనాభం. పవన్‌ను తానెప్పుడు కలవలేదని, సినిమాల్లో అప్పుడెప్పుడో చూశాను తప్ప ఆయనతో అంత పరిచయం లేదన్నారు ముద్రగడ. తిరుపతిలో మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్‌తో కాపు నేత ముద్రగడ పద్మనాభం

పవన్ కళ్యాణ్‌‌ను ఇప్పటివరకూ తను ఎదురుగా చూడలేదన్నారు కాపు నేత ముద్రగడ పద్మనాభం. పవన్‌ను తానెప్పుడు కలవలేదని, సినిమాల్లో అప్పుడెప్పుడో చూశాను తప్ప ఆయనతో అంత పరిచయం లేదన్నారు ముద్రగడ. తిరుపతిలో మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్‌తో కాపు నేత ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. కాపులకు చంద్రబాబు ఇచ్చిన కానుకతో కడుపు నిండలేదని,  కాపుల ఉద్యమం ఇక్కడితో ఆగలదేన్నారాయన.
 
చంద్రబాబు హామీకి మార్చి 31 వరకు డెడ్ లైన్ మాత్రమేనని, పూర్తిస్థాయిలో అమలు చేయకుంటే మళ్ళీ పోరాటం ప్రారంభిస్తామని హెచ్చరించారు. కాపులు ఎమ్మార్వో కార్యాలయంకు వెళ్ళి బిసి సర్టిఫికెట్ తీసుకున్నప్పుడే మాకు అసలైన పండుగ వచ్చినట్లన్నారు ముద్రగడ. కాపు ఉద్యమానికి రాని వారిని బలవంత పెట్టాల్సిన అవసరం తనకు లేదన్నారు ముద్రగడ పద్మనాభం.