సోమవారం, 7 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (20:32 IST)

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

Alekhya Chitti Pickles
అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles) ఆన్‌లైన్ వ్యాపారం ఓ రేంజిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు చేస్తున్నారు. వారి పేర్లు అలేఖ్య, చిట్టి, రమ్య. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఫన్నీ కామెంట్లు చేస్తూ వ్యాపారాన్ని బాగానే విస్తరించారు. కానీ కాస్తంత నోటి దూలతో ఇప్పటివరకూ వున్న పేరునంతా తమంతట తామే అధఃపాతాళానికి తొక్కేసుకున్నారు.
 
వీరు ఇన్ స్టాగ్రాం, వాట్సాప్ ద్వారా పికిల్స్ అమ్ముతుంటారు. ఇందులో భాగంగా ఓ వ్యక్తి... హాయ్ నాకు పచ్చళ్లు కావాలి రేట్లు ఎంత అనగానే లిస్ట్ పెట్టేసాడు. అందులో అరకిలో నాన్ వెజ్ పచ్చళ్లు రూ. 530 నుంచి రూ. 1660 వరకూ వున్నాయి. ఈ ధరలు చూసి అతడు... వామ్మో ఇంత కాస్ట్లీనా అంటూ ప్రశ్నించాడు. అంతే.. అతడిపైన బూతులతో తిట్ల దండకం ఎత్తుకుని దాన్ని వాట్సప్ ఆడియోలో పోస్ట్ చేసేసారు. అంతటి అసభ్యకర పదజాలంతో వున్న ఆ వాయిస్ మెసేజ్ విని అతడు షాక్ తిన్నాడు.
 
మూడు వేల రూపాయలు పెట్టి పచ్చడి కొనుక్కోలేనివాడివి, నీ పెళ్లానికి బంగారం ఏం కొనిస్తావ్, చీరలు ఏం కొనిస్తావ్, ముందు డబ్బులు సంపాదించడం నేర్చుకోరా అంటూ బూతులు తిడుతూ వాయిస్ మెసేజ్ పెట్టేసింది. మరో మహిళకు.... ఒసేయ్ పిచ్చిముఖం దానా ఇంత తక్కువ రేట్లను కూడా నువ్వు భరించలేకపోతున్నావ్. ఎక్కువ ధర వుందని అంటున్నావ్. నీ దరిద్రం ఏం రేంజిలో వుందో నేను అర్థం చేసుకోగలను. నా మాట విని నాలుగు ఇళ్లలో పాచిపని చేసుకుని బ్రతుకు అంటూ దుర్భాషలాడింది. వీటికి సంబంధించి సదరు బాధితులు వున్నదివున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. మీరు చూడండి ఆ వాయిస్ మెసేజ్ వీడియో...