ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 21 మార్చి 2021 (10:49 IST)

26న భారత బంద్‌

బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రభుత్వరంగా సంస్థ ఏర్పాటు కాలేదని ఏపీ విద్యార్థి, యువజన సంఘాల ఐక్యకార్యచరణ కమిటీ విమర్శించింది. మోదీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.

మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని...ఉద్యోగాలు కల్పించలేదని... ఉన్న దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా 26న దేశావ్యాప్తంగా భారత బంద్‌కు కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.

వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి పోరాడాలని డిమాండ్ చేశారు. పిల్లలకు పాఠశాలలో విద్యాసంస్థలో కరోనా నిబంధనలు పాటించడం లేదన్నారు. క్లాసులు జరగడం వలన పిల్లల ప్రాణాల మీదకు వస్తుందని తెలిపారు.

ప్రైవేట్ పాఠశాలల్లో కరోనా నిబంధనలు లేవని... విద్యార్థుల ప్రాణాలకంటే పాఠాలు ఎక్కువ కాదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించి ఆన్‌లైన్‌లో క్లాసులు జరపాలని విద్యార్థి, యువజన సంఘాల ఐక్యకార్యచరణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.