మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (09:01 IST)

5న జరిగే రాష్ట్ర బంద్ కు సహకరించండి: జగన్ కి రామకృష్ణ లేఖ

విశాఖ ఉక్కు పరిరక్షణకై మార్చి 5న జరిగే రాష్ట్ర బంద్‌కు సహకరించాలంటూ సీఎం జగన్‌ను సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు సీఎంకు ఆయన లేఖ రాశారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక మార్చి 5న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిందని...ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.

ఇప్పటికే వామపక్ష పార్టీలు, కాంగ్రెస్,  ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలు, పలు వర్తక, వాణిజ్య, ప్రజాసంఘాలు బంద్‌కు మద్దతిచ్చి ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయని తెలిపారు.

వైఎస్సార్సీపీ కూడా బంద్‌కు మద్దతు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.