శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 7 మార్చి 2017 (10:02 IST)

నిన్న అమెరికా.. నేడు న్యూజిలాండ్ : దేశం వదిలి వెళ్లాలంటూ సిక్కు యువకుడికి వార్నింగ్

అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో నివశించే భారతీయులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్లను కాల్చిచంపారు. ఆ తర్వాత గుజరాతీ వ్యాపారిపై కాల

అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో నివశించే భారతీయులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్లను కాల్చిచంపారు. ఆ తర్వాత గుజరాతీ వ్యాపారిపై కాల్పులు జరిపారు. నిన్నటికి నిన్న వరంగల్‌కు చెందిన జ్యోతి అనే యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. దీంతో అమెరికాలోని భారతీయులు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు.
 
ఈ పరిస్థితి న్యూజిలాండ్ వంతు వచ్చింది. ఆక్లాండ్‌లో ఓ సిక్కు యువకుడిపై స్థానికుడు జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. నరీందర్వీర్ సింగ్ అనే యువకుడు, తన కారును పార్కింగ్ నుంచి తీస్తుండగా, ఓ జంట మరో వాహనంలో వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. 
 
కారు నడుపుతున్న వ్యక్తి నరీందర్వీర్‌ను తమ దేశం విడిచి వెళ్లాలని బెదిరిస్తూ, అసభ్య పదజాలంతో దూషించినట్టు సమాచారం. వారు వెళ్లిపోయేటప్పుడు తాను పక్కకు తప్పుకున్నానని, కారులోని యువతి తనవైపుకు వేలు చూపించగా, అతను తిట్ల దండకానికి దిగాడని, చాలా అవమానకరంగా మాట్లాడాడని బాధితుడు వాపోయాడు. 
 
ఈ ఘటనను తాను వీడియో తీయగా, అతను మరింత రెచ్చిపోయాడని చెప్పాడు. అలాగే, మరో ఘటనలో విక్రమ్ జిత్ సింగ్ అనే వ్యక్తిపై స్థానికుడు అసభ్యంగా మాట్లాడుతూ, స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలని బెదిరించినట్టు తెలుస్తోంది. తాజా ఘటనలతో న్యూజిలాండ్ లోని ఇండియన్ కమ్యూనిటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.