శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

నేను సెల్ టవర్‌ని.. కూల్చొద్దు ప్లీజ్!... మావోలకు వినూత్న విజ్ఞప్తి

మావోయిస్టుల చర్యలకు వ్యతిరేకంగా చింతపల్లి మండల కేంద్రంలో నమూనా సెల్ టవర్ వెలసింది. గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని ఏర్పాటు చేశారు.

ఆ సెల్ టవర్ పక్కన మావోయిస్టులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలతో కూడిన ప్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ప్లెక్సీలోని సారాంశం.. ‘‘నేను సెల్ టవర్‌ని. ప్రజలకు ఉపయోగపడే దాన్ని. నన్ను ధ్వంసం చేయొద్దు’’ అంటూ మావోయిస్టులను ఉద్దేశించి పెక్సీలో పేర్కొన్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్లను ఏర్పాటు చేస్తే వాటిని మావోయిస్టులు ధ్వంసం చేసిన సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు నమూనా సెల్‌ టవర్‌ను ఏర్పాటు చేసి.. సెల్ టవర్లన్ కూల్చొద్దంటూ మావోలకు విజ్ఞప్తి చేశారు.