ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:19 IST)

దాడులు చేయబోం..మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం..!

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సీపీఐ మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం ప్రకటించింది. మల్కన్​గిరి కోరాపుట్ - విశాఖ డివిజన్ (ఎంకేవీ) కమిటీ కార్యదర్శి కైలాసం ఈ మేరకు ఓ ఆడియో టేపును విడుదల చేశారు. 
 
దేశ వ్యాప్తంగా కరోనాతో అధిక సంఖ్యలో మరణాలు సంభివిస్తున్నాయని, వేలాది మంది వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు. 
 
వైరస్​ను నిరోధించడానికి పాలకవర్గాలు చేస్తున్న ప్రయత్నానికి ఆటంకం కలిగించకూడదని నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రధానంగా ఈ విపత్కర సమయంలో మావోయిస్టు పార్టీ నుంచి గానీ పీఎల్​జీఏ, అనుబంధ సంస్థల నుంచి పోలీసులపై ఎటువంటి దాడులకు పూనుకోబోమని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.