బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (08:27 IST)

జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది... ఏపీలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం విధించింది. ఆరోగ్య రంగంలో సుజాతరావు కమిటీ సిఫారసులకు జగన్ ప్రభుత్వ ఆమోదం తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకుంది.

వందకు పైగా సిఫారసులు చేసింది సుజాతరావు కమిటీ... హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకూ ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది. ఆరోగ్య చికిత్సల జాబితాలోకి మరిన్ని వ్యాధులు చేర్చాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ వైద్యుల వేతనాలు పెంచాలని కమిటీ సూచించింది. 
 
జనవరి 1వ తేదీ నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పథకం అమలుకానుంది. 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తెస్తూ... పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా.. మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను కొత్తగా చేర్చింది ప్రభుత్వం. ఆపరేషన్లు చేయించుకున్న వాళ్లు కోలుకునే వరకూ నెలకు రూ.5 వేల సాయం అందించనున్నారు.

కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లాగే.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 5 వేలు సాయానికి సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. రూ. వెయ్యి వ్యయం దాటే ప్రతి వ్యాధికి ఆరోగ్య శ్రీలో చికిత్స అందిస్తారు. డిసెంబర్ 21 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ జరుగుతుంది.