బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 23 జులై 2020 (10:42 IST)

ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దులో కూంబింగ్.. మావోయిస్టు అగ్ర నేతల కోసం జల్లెడ

ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దులో పెదబయలు మండలం లండుల అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టు నాయకులు గాయపడినట్లు సమాచారం.

మావోయిస్టుల కీలక సమావేశంలో అగ్రనేత ఆర్ కె చలపతి, అరుణ అక్క పాల్గొన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. 

పోలీసుల కాల్పుల్లో ఆర్కే తప్పించుకోగా అరుణ చలపతి గాయపడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ముంచంగిపుట్టు పెదబయలు అటవీ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ కొనసాగుతోంది.

భారీగా మోహరించిన భద్రతా బలగాలు మావోయిస్టు అగ్ర నేతల కోసం అడవిని జల్లెడ పడుతున్నాయి.