బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 12 మార్చి 2021 (17:56 IST)

తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరీ అంత ఘోరంగా వుందా? అంబటి ఏం చెప్పారో చూడండి

తెలుగుదేశం పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నామరూపాలు లేకుండా పోతుందని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో సైకిల్ గుర్తు ఎటు పోయిందో తెలియలేదన్నారు. జగన్ గారి పట్ల వున్న నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఏ ఎన్నిక వచ్చినా తమ పార్టీకి భారీ మెజారిటీని కట్టబెడుతున్నారన్నారు.
 
పంచాయతీ ఎన్నికల ఫలితాలు మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయన్నారు. సత్తెనపల్లిలో పది స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థుల కోసం తీవ్రంగా ప్రయత్నించినా అభ్యర్థులే దొరకలేదని ఎద్దేవా చేశారు.
 
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెదేపా కనుమరుగైపోతుందనీ, ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీ చేయకుండా వుండటమే మంచిదని చాలామంది తప్పుకుంటారని జోస్యం చెప్పారు. మరి అంబటి రాంబాబు చెప్పినట్లే తెదేపా పరిస్థితి వుంటే ఇక ఆ పార్టీ పరిస్థితి ఏమిటో?