గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2024 (13:08 IST)

బాలీవుడ్ చిత్రాల నిర్మాణ వ్యయం కంటే తక్కువు ఖర్చుతో ఎలా సాధ్యం : పవన్ ప్రశ్న

pawan
అతి తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగాలు ఎలా చేపడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన షార్ సెంటర్ శాస్త్రవేత్తలను ప్రశ్నించారు. ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించిన తర్వాత తొలిసారి తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న షార్ సెంటరులో నిర్వహించిన నేషనల్ సైన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన షార్ సెంటరులో కలియదిరుగుతూ శాస్త్రవేత్తలను అడిగి అనేక విషయాలు తెలుసుకున్నారు. 
 
అంతకుముందు షార్ సెంటరుకు చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు షార్ డైరెక్టర్ రాజరాజన్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజరాజన్ ఆయనకు చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగ నమూనాను బహూకరించారు. ఆ తర్వాత స్పేస్ సెంటర్‌లో జరిగిన జాతీయ అంతరిక్ష ఉత్సవాల్లో పాల్గొని, రాకెట్ ప్రయోగాలకు అవుతున్న ఖర్చును శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. 
 
బాలీవుడ్ సినిమాకు అయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగాలు చేస్తుండటంపై పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇంతటి తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగాలు చేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు రియల్ హీరోలు అంటూ ప్రశంసించారు. రాకెట్ ప్రయోగాలు చేసే సైంటిస్టులు కనిపించని దేవుళ్లు అని అన్నారు. విద్యార్థులు, యువత సైంటిస్టులను ఆదర్శంగా తీసుకుని నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని సూచించారు.
 
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీశ శాస్త్రవేత్తలకు తోడ్పాటు అందిస్తూ అండగా ఉండటంతో ప్రయోగాలు సక్సెస్ అవుతున్నాయన్నారు. శ్రీహరికోట సందర్శనతో తన చిన్న నాటి కల నెరవేరిందని పవన్ అన్నారు. అనంతరం అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు బహూకరించారు. కాగా, ఏపీ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖామంత్రిగా కూడా పవన్ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.