గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2024 (17:01 IST)

పవన్ కళ్యాణ్ అన్నమాటల్లో తప్పేమిటి? మీడియాకు హరీశ్ శంకర్ సూటిప్రశ్న

Harish Shankar
Harish Shankar
ఇటీవల మంత్రి హోదాలో అటవీశాఖకు సంబంధించిన ఎర్రచందనం విషయంలో సినిమాలలో ఎర్రచందనం చెట్లను నరకడమే హీరోయిజమా? అంటూ ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ అన్న మాటలు కొంతమందిని హర్ట్ చేశాయి. ఇది కేవలం అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించే అంటూ రకరకాలుగా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని నేడు హరీశ్ శంకర్ ను విలేకరులు కలిసినప్పుడు దర్శకులు చూపే హీరోలు విలనిజం చేసినా హీరోయిజంగా చూపిస్తున్నారు. దీనిపై ఇటీవలే పవన్ కళ్యాణ్ మాటలు వైరల్ అయ్యాయి? దీనికి మీ సమాధానం ఏమిటని అడిగారు. 
 
అందుకు స్పందించిన హరీశ్ శంకర్, సినిమా అనేది కేవలం ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే. పవన్ కళ్యాన్ గారు స్వతహాగా పర్యావరణ రక్షకుడు. ఆయన తగిన మంత్రిపదవి దక్కింది.  తను ఓ సందర్భంలో సందర్భానుసారంగా మాట్లాడివుంటారు. అందులో తప్పేముంది? పుష్పలో చూపించినవిధంగా అందరూ గొడ్డళ్ళు పట్టుకుని అడవులకు వెళ్ళరు గదా. అపరిచితుడు, జాకీజాన్ సినిమాలలో హీరోలు చేసే పనులు ప్రేక్షకుడు చేయడు గదా? ఎవరి అభీష్టం మేరకు వారు ఆయా రంగాల్లో స్థిరపడతారు. ఏ సినిమా అయినా అది పాత్రమేరకే మనం చూడాలి. కథ రాసిన దర్శకుడు కోణం వేరుగా వుంటుంది. సినిమాలో చూపించినట్లుగా అన్ని జరిగితే దేశం మరో లెవల్లో వుంటుంది. సినిమా అనేది కొంతటైం మేరకు ఎఫెక్ట్ వుంటుంది. ఆ తర్వాత దాన్ని గురించి మర్చిపోతారు. దాన్ని పెద్ద కోణంలో సోషల్ మీడియా ఆలోచించి రకరకాల కథనాలు రాస్తూ మంచి ఉద్దేశ్యంతో అన్న మాటలు కూడా తప్పుదోవ పట్టించడం సమంజసం కాదని తన అభిప్రాయమని వెల్లడించారు. 
 
హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ ఆగస్టు 14న రాత్రి విడుదలకాబోతోంది. నాట్ ఆగస్టు 15 అంటూ లాజికల్ క్లారిటీ కూడా ఇచ్చారు.