సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2017 (17:32 IST)

ఇవాంకాకు తెరాస ఎమ్మెల్యే సీటు ఇవ్వాలి: రాజశేఖర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ రాకతో హైదరాబాద్ పూర్తిగా మారిపోయిందని.. రోడ్లు క్షణాల్లో అద్భుతంగా మారిపోయాయని.. చాలా రోజులకు తర్వాత ఫుట్ పాత్‌లకు రోడ్లకు వున్న వ్యత్యాసం తెల

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ రాకతో హైదరాబాద్ పూర్తిగా మారిపోయిందని.. రోడ్లు క్షణాల్లో అద్భుతంగా మారిపోయాయని.. చాలా రోజులకు తర్వాత ఫుట్ పాత్‌లకు రోడ్లకు వున్న వ్యత్యాసం తెలిసిందని స్టాండప్ కమెడియన్ రాజశేఖర్ వీడియోలో సెటైరికల్‌‌గా వెల్లడించారు. హైద‌రాబాద్ రోడ్ల‌న్నీ బాగుప‌డ్డాయ‌ని, వ‌ర్షాకాలంలో హైద‌రాబాదీలు చేసిన పూజ‌ల‌ను దేవుడు ఆల‌కించి ఇవాంకాను హైదరాబాదుకు పంపించారని రాజశేఖర్ జోకులు పేల్చారు. 
 
ఇకపై ఆస్కార్, ఒలింపిక్స్ వంటివన్నీ హైదరాబాదులోనే జరగాలని కోరుకున్నాడు. ఇవాంకా ఆరు నెల‌లకొక‌సారి హైదరాబాదుకు రావాలని కోరాడు. ఇంకా ఇవాంకా వ‌య‌సు గురించి, ఆమె వృత్తి గురించి, హైద‌రాబాద్ ప‌రిస్థితి గురించి కొన్ని జోకులు వేస్తూ ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఇవాంకా రాక‌తో సిటీలో వ‌చ్చిన మార్పు 'శివాజీ' సినిమాలో ర‌జ‌నీకాంత్ న‌డుస్తుంటే ఆ వెన‌కాలే రోడ్డు ప‌డుతూ రావడాన్ని గుర్తుచేసింద‌ని చేశారు. అందుచేత ఇవాంకాకు తెలంగాణ రాష్ట్ర సమితి సీటు అదీ ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని రాజశేఖర్ కోరాడు.