సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2017 (17:11 IST)

రామోజీ ఫిల్మ్ సిటీలో ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‍‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్‌కు ఆతిథ్యమివ్వనుంది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు ఈ కార్నివాల్‌ను నిర్వహించేందుకు అన్ని ఏర్పా

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‍‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్‌కు ఆతిథ్యమివ్వనుంది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు ఈ కార్నివాల్‌ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. ఆయనతోపాటు కేంద్ర పర్యాటక శాఖామంత్రి ఆల్ఫోన్స్ కన్నథానమ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పాల్గొనున్నారు.
 
ఈ కార్నివాల్‌కు సుమార్ 50 వేల మంది సందర్శకులతో పాటు 5000 మంది వివిధ దేశాల ప్రతినిధులు, 500 మందికిపైగా ఇన్వెస్టర్లు, 300 మంది ఎగ్జిబిటర్లు, 2500 మంది వరకు వివిధ రంగాల్లో నిపుణులు హాజరుకానున్నారు. యూఏఈకి చెందిన ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త షోహాన్ రాయ్ ఆధ్వర్యంలోని ఇండీవుడ్స్ ఈ కార్నివాల్‌ను నిర్వహించనుంది. షోహాన్ రాయ్‌కు ఏరైస్ గ్రూపు సీఈవో, ఛైర్మన్‌గా కూడా ఉన్నాయి.
 
ఈ గ్రూపునకు 10 వేల న్యూ 4కే ప్రొజెక్షన్ మల్టీప్లెక్స్‌ స్క్రీన్స్, లక్ష వరకు 2కే/4కే ప్రొజెక్షన్ హోమ్ సినిమాస్, 8కే/4కే ఫిల్మ్ స్టూడియోలు, 100 యానిమేషన్/వీఎఫ్ఎక్స్ స్టూడియోలు, ఫిల్మ్ స్కూల్స్ ఇలా అనేక సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయి. ఈ ప్రారంభ కార్యక్రమానికి దేశంలో సుమారు 50 మంది బిలియనీర్లతో పాటు 500 మంది ఇన్వెస్టర్లు హాజరుకానున్నారు. ఈ కార్నివాల్‌ సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అలాగే, 50 దేశాలకు చెందిన 115 సినిమాలను కూడా ప్రదర్శించనున్నారు.
 
ఇదే అంశంపై షోహాన్ రాయ్ స్పందిస్తూ ఇండీవుడ్ ఫిల్మ్ మార్కెట్ అనేక మంది ఫిల్మ్ మేకర్స్‌కు, నిర్మాతలకు, ఇన్వెస్టర్లకు, టెక్నాలజీ డెవలపర్స్‌కు ఓ వేదికకానుంది. ముఖ్యంగా, యువ ప్రతిభావంతులకు ఇది ఎంతో అనుకూలమైనదని షోహాన్ రాయ్ అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఈ కార్నివాల్‌లో భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకదిగ్గజాలు కూడా పాల్గొని తమ అనుభవాలను, అభిప్రాయాలను వెల్లడించనున్నారు.