బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (13:10 IST)

జగన్ ప్రభుత్వం రైతులకు పండుగ సంతోషాన్ని దూరం చేసింది: నిమ్మల రామానాయుడు

రాష్ట్ర రైతాంగం పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, గత 40ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా తుఫాన్లు, వరదలు, ఇతర విపత్తులకారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయి, కష్టనష్టాల పాలయితే, ఆదుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారిని నిలువునా  మోసగిస్తోందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పార్టీ శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తంచేశారు.

శుక్రవారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా ...! 
 
రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తున్నామన్న ప్రభుత్వం, ఆ సాయాన్ని పత్రికల్లో ప్రకటనలకే పరిమితం చేసింది. 100మంది రైతులకు గాను కేవలం 10మందికి మాత్రమే ప్రభుత్వం సాయం చేసి చేతులు దులుపుకొంది. రైతులకు ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడీ సాయంకంటే, ప్రభుత్వం ప్రకటనలకే  ఎక్కువసొమ్ముని ఖర్చు చేస్తోందన్నారు. ఖరీఫ్ సీజన్ లో రైతులు 39లక్షల ఎకరాలవరకు పంటనష్టపోతే,  ప్రభుత్వం కేవలం 12లక్షల ఎకరాలుగా మాత్రమే లెక్కలు వేసిందన్నారు.

మిగిలిన 27లక్షలఎకరాల పంటనష్టాన్ని ఎవరు భర్తీచేస్తారో సమాధానంచెప్పాలి.  చంద్రబాబునాయుడి హాయాంలో హెక్టారుకు రూ.20వేలసాయం చేస్తే, ఈ ప్రభుత్వం దాన్ని రూ.15వేలకు తగ్గించేసింది. రైతులకు రూ.6వేలకోట్ల వరకు నష్టపరిహారం అందచేయాల్సి ఉండగా, కేవలం రూ.601కోట్లతో జగన్మోహన్ రెడ్డి సరిపెట్టారు. అరకొర సాయం చేస్తూ, కార్యాలయం లో కూర్చొని బటన్లు నొక్కుతున్న ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం.

దేశంలో అన్నిరాష్ట్రాలు 2019కి సంబంధించి రైతులతాలూ కా పంటలబీమాను సక్రమంగా చెల్లిస్తే, రాష్ట్రప్రభుత్వం మాత్రం చెల్లించలేదు. రైతుల తాలూకా పంటలబీమాసొమ్ముని కట్టకుండా మర్చిపోయిన ప్రభుత్వం, రైతులనే మర్చిపోయింది. 2020 కి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం రూపాయికూడా పంటలబీమా సొమ్ము చెల్లించలేదు.  కిందిస్థాయిలో రైతులకు ఎలాంటిసాయం చేయని ముఖ్యమంత్రి, కేవలం ప్రకటనల్లోమాత్రమే గొప్పలు చెప్పుకుంటున్నాడు.

సున్నావడ్డీ, రైతుభరోసా, ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా పథకాలకు సంబంధించి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ముఖ్యమంత్రి బటన్లు నొక్కుతున్నాడు తప్ప, దానివల్ల రైతులకు ఒరిగింది శూన్యం. రైతులదృష్టిలో జగన్మోహన్ రెడ్డి బటన్ ముఖ్యమంత్రిగానే మిగిలిపోయాడు. 

ధాన్యం కొనుగోళ్లతాలూకూ రైతులకు చెల్లించాల్సినధాన్యం సొమ్ము ని కూడా జగన్ ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదు. గతఏడాదికి సంబంధించిన ధాన్యం బకాయిలను ఈ ఏడాదికి కూడా చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో జగన్ ప్రభుత్వముంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.2,726కోట్లవరకు ధాన్యంరైతులకు చెల్లించాల్సిఉంటే,  జగన్ ప్రభుత్వం రూపాయికూడా చెల్లించకుండా అన్నదాతలను వేధిస్తోం ది. 

దినసరికూలీలు, నెలవారీజీతంతో పనిచేయడంకాకుండా, సంవత్సరం మొత్తం కష్టపడే రైతులకు చెల్లించాల్సిన సొమ్ముని సకాలంలో చెల్లించకపోతే కర్షకులు ఎలా బతుకుతారనే ఆలోచన ప్రభుత్వం ఎందుకుచేయడంలేదు?  పశ్చిమగోదావరి జిల్లా రైతాంగా నికి రూ.881కోట్లు, అనంతపురం ధాన్యం  రైతులకు రూ.2కోట్ల79లక్షలు, తూర్పుగోదావరి జిల్లావారికి రూ.771కోట్ల91 లక్షలు, గుంటూరు రైతులకురూ.40కోట్ల06లక్షలవరకు ధాన్యం కొనుగోలు బకాయిలతాలూకా సొమ్ము చెల్లించాల్సి ఉంది.

ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా చెల్లించాల్సినసొమ్ముని ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. రూ.2,726కోట్లను రైతులకు చెల్లించకపోతే, వారికి పెట్టుబడికి డబ్బులుఎక్కడినుంచి వస్తాయో ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి సమాధానం చెప్పాలి. సంక్రాంతి పండుగ రైతులకు ముందే వచ్చిందని చెప్పినమంత్రులు, ప్రభుత్వం, వాస్తవంలో అన్నదాతల కు దు:ఖాన్ని మిగిల్చిపండుగసంతోషాన్ని నిజంగానే దూరం చేసింది. 

నిత్యావసరాలధరలు పెరిగిపోయి, పేదలు, మధ్యతరగతి వారు కూడా పండుగ చేసుకోలేని దుర్భరస్థితిని అనుభవిస్తున్నా రనే నిజాన్ని ప్రభుత్వం ఎందుకుగుర్తించలేకపోతోంది. అందరికీ అన్నంపెట్టే అన్నదాతనే జగన్ ప్రభుత్వం పస్తులుండేస్థితికి చేర్చడం బాధాకరం.

రైతులను మోసపుమాటలతో దగాచేస్తున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి పరిపాలన సాగించే అర్హతలేదని స్పష్టంచేస్తున్నాను. సంక్రాంతిలోపు ప్రభుత్వం తక్షణమేధాన్యం బకాయిలుచెల్లించకపోతే, ప్రభుత్వమెడలు వంచైనాసాయం చేయించేవరకు తెలుగుదేశం పార్టీ రైతులతరపున పోరాటం చేస్తుందని పాలకులను హెచ్చరిస్తున్నాను.