ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (16:35 IST)

కడప జిల్లాలో సీఎం జగన్‌ టూర్..

jagan
కడప జిల్లాలో సీఎం జగన్‌ టూర్ కొనసాగుతుంది. పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భాకరాపురం రింగు రోడ్డు సర్కిల్‌లో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ ఆలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 
 
సీఎం జగన్‌కు పూర్ణకుంభంతో వేదపండితులు ఘనంగా స్వాగతం పాలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సీఎం. 4 ఎకరాల విస్తీర్ణంలో రూ.4.54 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మించారు. శిల్పారామంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ప్రారంభించారు. 
 
పులివెందులలో అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటుకు స్వామి నారాయణ్‌ సంస్థకు 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించిందిన ప్రభుత్వం. మరోవైపు రూ.9.96 కోట్ల పాడా నిధులతో ఏపీ కార్ల్ నందు నిర్మించిన అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజీలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.