బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 22 మే 2020 (08:37 IST)

ప్రజల సంతోషం గురించి ఆలోచించే నాయకుడు జగన్: మంత్రి ముత్తంశెట్టి

రాష్ట్రంలో అన్ని రకాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచించే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని  పర్యాటక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నంలోని  ఏడోవ వార్డు వాంబే కాలనీ లో పేద ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాదయాత్రలో ఇచ్చిన హామీలే కాకుండా అయిదు సంవత్సరాల్లో చేయాల్సిన పనులు 90%  ఒక్క సంవత్సరం లొనే పూర్తి చేశారన్నారు. దశల వారిగా మద్యం నిషేదిస్తున్నామన్నారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలను ఆదుకుంటున్నారన్నారు.

ప్రతి ఒక్క పేదవాడికి ఎదో ఒక మంచి చేయాలని తపన ఉన్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు.  వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకున్న మంత్రి  పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు.

రాష్ట్రంలో మైనారిటీల విద్య, ఉపాధి, అభివృద్ధి కోసం పాటుపడుతున్నది తమ ప్రభుత్వమే నన్నారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి కల్పించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వేయి మంది పేదలకు సరుకులు కూరగాయలు  పంపిణీ చేశారు.

అనంతరం ఎనిమిదో వార్డు సాగర్ నగర్ లో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, రంజాన్ తోఫా పంపిణీ  చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారులు,   ఎనిమిదోవ ల లొడగల రామ్మోహన్,పోతుల శ్రీనివాసరావు,  తదితరులు పాల్గొన్నారు.