మంగళవారం, 8 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 4 జూన్ 2016 (13:56 IST)

అప్పుడు 'చెప్పు' వ్యాఖ్య... ఇప్పుడు బాబుకు 'తోలు మందం' అంటూ జగన్

జగన్ మోహన్ రెడ్డి ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మొన్న అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ కనబడితే అక్కడ చెప్పులతో కొట్టాలంటూ వ్యాఖ్యానించిన జగన్ మోహన్ రెడ్డి, తాజాగా మరోసారి చంద్రబాబు నాయుడ

జగన్ మోహన్ రెడ్డి ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మొన్న అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ కనబడితే అక్కడ చెప్పులతో కొట్టాలంటూ వ్యాఖ్యానించిన జగన్ మోహన్ రెడ్డి, తాజాగా మరోసారి చంద్రబాబు నాయుడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని ఎన్‌పీ కుంటలో రైతు భరోసా యాత్రలో ఆయన మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా ఆయన... చంద్రబాబుకు తోలు మందం ఎక్కువైందని, అందుకే రైతులను పట్టించుకోవడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. నియంత హిట్లర్ మాదిరిగా ప్రవర్తిస్తున్న చంద్రబాబు భూ కుంభకోణాలకు పాల్పడుతున్న వారిని వెనకేసుకొస్తున్నారంటూ విమర్శించారు. ఇదిలావుండగా మొన్న జగన్ మోహన్ రెడ్డి సీఎంను చెప్పులతో కొట్టాలంటూ వ్యాఖ్యలు చేయడంపై తెదేపా శ్రేణులు తీవ్ర నిరశనను తెలియజేస్తున్నాయి. ఐతే జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎంతమాత్రం వెనక్కి తగ్గడంలేదు. తనదైన పంథాలో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.