బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 29 మార్చి 2017 (13:57 IST)

జగన్ జాతకం మామూలుగా లేదు... సంచలనం సృష్టిస్తారు... రామచంద్ర శాస్త్రి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి జాతకం ఎలా వుందో ఈ హేవళంబి నామ సంవత్సరం సందర్భంగా పంచాంగకర్త రామచంద్ర శాస్త్రి వివరించారు. ఆయన జాతకం మామూలుగా లేదనీ, అద్భుతంగా వుందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాను తెచ్చేది కూడా జగన్ మోహన్ రెడ్డేనంటూ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి జాతకం ఎలా వుందో ఈ హేవళంబి నామ సంవత్సరం సందర్భంగా పంచాంగకర్త రామచంద్ర శాస్త్రి వివరించారు. ఆయన జాతకం మామూలుగా లేదనీ, అద్భుతంగా వుందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాను తెచ్చేది కూడా జగన్ మోహన్ రెడ్డేనంటూ వెల్లడించారు. ఇది కూడా 2019 ఎన్నికల తర్వాత జరుగుతుందని చెప్పుకొచ్చారు.
 
ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఏకపక్షంగా దూసుకువెళుతుందనీ, ఆయన పార్టీకి చెందిన అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పారు. దాంతో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారనీ, ఆ తర్వాత ప్రత్యేక హోదాను సాధిస్తారని చెప్పుకొచ్చారు. 
 
కాగా ఉగాది సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. పంచాంగ శ్రవణాన్ని జగన్ మోహన్ రెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆలకించారు. అనంతరం జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.