జగన్‌ రహస్య ఒప్పందాలు బహిర్గతం చేయాలి: టీడీపీ

varla ramaiah
ఎం| Last Updated: గురువారం, 13 ఫిబ్రవరి 2020 (08:41 IST)
ప్రధాని మోదీతో సీఎం జగన్‌ రహస్య ఒప్పందాలు బహిర్గతం చేయాలని టీడీపీ నేత వర్ల వర్ల రామయ్య అన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న హామీ ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా మినహా ఏం తెచ్చినా ప్రజలు హర్షించరన్నారు. సీబీఐ కేసులు, వ్యక్తిగత హాజరు మినహాయింపు...మండలి రద్దు, మూడు రాజధానుల కోసమే జగన్‌ ఢిల్లీ
వెళ్లారని పేర్కొన్నారు.

‘‘కేంద్ర విద్యా సంస్థలు, పోలవరం, రైల్వే జోన్‌ అంశాలను ప్రస్తావించారా?..కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న కాపుల రిజర్వేషన్‌ అంశంపై చర్చించారా?’’ అని ప్రశ్నించారు.

ప్రధానితో భేటిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వృథా చేశారన్నారు. జగన్‌ వ్యక్తిగత ఎజెండా పక్కనపెట్టి నిధుల కోసం పోరాడాలని సూచించారు.
దీనిపై మరింత చదవండి :