గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (07:38 IST)

వైసీపీ ఎంపీపై టీడీపీ సంచలన కామెంట్స్

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుపై మాధవ్ చేసిన విమర్శలకు ధీటుగా బదులిచ్చారు. వ్యభిచారంలో ఎంపీ గోరంట్ల మాధవ్  సిద్ధహస్తుడని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు.

గోరంట్ల మాధవ్ బెదిరింపుల వల్లే కియా అనుబంధ సంస్ధలు వెళ్లిపోయాయని తెలిపారు. మాధవ్‌ను హిందూపురం నుంచి ఎప్పుడు తరిమేద్దామా అని ప్రజలు చూస్తున్నారన్నారు.

అమరావతి రెఫరెండంపై విశాఖ జిల్లాలోని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు.. గుంటూరు ఎంపీ రాజీనామాకు సిద్ధమని తెలిపారు. రాజధానిలోని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాకు మంత్రి అవంతి శ్రీనివాస్ ఒప్పించాలన్నారు.

వైసీపీ నేతల భూకబ్జాలతో విశాఖ ప్రజలు భయంతో బతుకుతున్నారని బుద్దా వెంకన్న అన్నారు.
 
 
రేప్ కేసులు ఉన్న ఎంపీ గోరంట్ల: టీడీపీ ఎమ్మెల్సీ
వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపణల పై టీడీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు ట్విట్టర్ వేదికగా స్పందించారు. "స్వతహాగా వ్యభిచారి అయిన ఎంపీ గోరంట్ల మాధవ్ రాజకీయ వ్యభిచారం గురించి మాట్లాడటం ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేసింది.

దేశంలోనే రేప్ కేసులు ఉన్న ఎంపీగా పేరుగాంచిన గోరంట్ల మాధవ్ రాజకీయాల్లోకి రావడమే దౌర్బాగ్యం అనుకుంటే ఇప్పుడు నీతులు మాట్లాడటం మరీ దారుణం. 
 
బహిరంగంగా కియా ప్రతినిధులను బెదిరించి, కియా కారు పై చెత్త రాతలు రాసి భయపెట్టిన వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ల చర్యలకు భయపడే కంపెనీలు పారిపోతున్నాయి.

చెయ్యాల్సిన దుర్మార్గపు పనులు చేసి ఇప్పుడు చంద్రబాబు గారు అంతర్జాతీయ సంస్థలతో వార్తలు రాయిస్తున్నారు అని ఏడుపులు ఎందుకు? 
 
తప్పయ్యింది అని కియా వాళ్ల కాళ్లు పట్టుకొని క్షమాపణ అడగండి మాధవ్ గారు. వైకాపా నాయకులు అడ్డుపడకుండా ఉంటే చంద్రబాబు గారు మొదలు పెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ నిర్విరామంగా కొనసాగుతుంది" అని అన్నారు.
 
నోరు అదుపులో పెట్టుకో
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు టీడీపీ నేత బీకే పార్థసారధి వార్నింగ్ ఇచ్చారు. మాధవ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రజలు కియా తరలిపోతుందా అని.. భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.

పరిశ్రమలకు వైసీపీ ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పరిశ్రమలు తరలిపోకుండా కాపాడుకుంటామని పార్థసారధి చెప్పారు. 
 
ఇందూ సంస్థ క్విడ్ ప్రోకో చేసిందని, జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టారని టీడీపీ నేత పల్లె రఘునాథ్‌రెడ్డి ఆరోపించారు.

లక్షల కోట్ల విలువైన భూముల్ని ధారాదత్తం చేస్తున్నారని, భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుని రైతులకు ఇవ్వాలని పల్లె డిమాండ్ చేశారు.