శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 8 ఫిబ్రవరి 2020 (16:56 IST)

ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఎన్ని కష్టాలో, నష్టాలో, అనర్థాలో?

ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఎన్ని కష్టాలో, ఎన్ని నష్టాలో, ఎన్నో అనర్థాలో జరిగిపోయాయని ట్విట్టర్‌లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో బడుగు, బలహీన వర్గాలకు టెండర్ పెడుతున్నారు. 
 
పేద ప్రజల పట్ల ఆయనకి ఉన్న వ్యతిరేకతని పెంచుకుంటూ పోతున్నారు. 7 లక్షల పెన్షన్లు ఎత్తేసారు... అంటూ ట్వీట్ చేశారు. మొన్నటి వరకూ ఒక్క పెన్షన్ కూడా తియ్యలేదు అని బుకాయించిన వైకాపా ప్రభుత్వం, రీ వెరిఫికేషన్ పేరుతో కొత్త డ్రామా ఎందుకు మొదలుపెట్టింది?
 
ఇప్పుడు 20 లక్షల రేషన్ కార్డులు ఎత్తేసి పేదవాడి నోటి దగ్గర కూడు లాగేసుకోవడానికి మనసెలా ఒప్పింది జగన్ గారు? మీరు ఊరుకో రాజభవనంలో ఉండొచ్చు. పేద వాడు అద్దె ఇంట్లో ఉన్నా చెత్త రూల్స్ పెట్టి రేషన్ కార్డు తీసేస్తారా? 
అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. 
 
అలాగే పేద వాడి పొట్ట కొట్టి రూ.1500 కోట్లు మిగుల్చుకొని ఏం సాధిస్తారు? ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్న జగన్ గారు సంక్షేమ వ్యతిరేకిగా చరిత్రలో మిగిలిపోతారు.. అంటూ నారా లోకేష్ ఫైర్ అయ్యారు.