సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 31 జనవరి 2020 (08:09 IST)

అఖిలపక్షంలో వైకాపా,టిడిపిల మధ్య వాగ్వాదం

పార్లమెంట్‌ అఖిలపక్ష సమావేశంలో టీడీపీ-వైసీపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఏపీ శాసనమండలి రద్దు, రాజధాని మార్పు అంశాలను పార్లమెంట్‌లో చర్చించాలని టీడీపీ ఎంపీలు పట్టుబట్టారు.

దీనిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, లోకసేభ ఎంపీ మిథున్‌ రెడ్డి స్పందించారు. రాజధాని మార్పు రాష్టానికి సంబంధించిన విషయమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వెంటనే కల్పించుకున్న టీడీపీ ఎంపీలు తాము కేంద్రంతో సంప్రదించిన తర్వాతే అమరావతిని ఎంపిక చేశామని తెలిపారు.

దీంతో ఇరు పార్టీల నేతల మద్య వాదన తీవ్రస్థాయికి చేరింది. గందరగోళం నెలకొనడంతో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కల్పించుకుని.. వైసీపీ నేతలకు క్లాస్‌ తీసుకున్నారు. టీడీపీ ఎంపీల అభిప్రాయాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

ప్రస్తావన మాత్రమే తీసుకువచ్చారని.. సభలో చర్చించాలా లేదా అనేది తర్వాత నిర్ణయిస్తామన్నారు. ఇది కేవలం చర్చపై జరుగుతున్న సమావేశం మాత్రమేనని.. చర్చించే అంశాలపై గొడవకు దిగడం సరికాదని రాజ్‌నాథ్‌ హితవు పలికారు.
 
సభ సజావుగా సాగేందుకు సహకరించండి: అఖిలపక్షంలో మంత్రి ప్రహ్లాద్ జోషి
పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షం సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ అన్నారు. ప్రతిపక్షం లేవనెత్తే ప్రతి అంశాన్ని వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

శుక్రవారం నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. గత పార్లమెంట్‌ సమావేశాల్లో ఆవెూదించిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ బ్జడెట్‌ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.

ఈ సమావేశాలను సజావుగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అఖిలపక్ష భేటీ అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. కశ్మీర్‌లో గత కొన్ని నెలలుగా నిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక అబ్దుల్లాను తక్షణమే విడుదల చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయని చెప్పారు.

సీఏఏ ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి అహంకారపూరితంగా ఉందన్నారు. నిరసనకారులతో చర్చించేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడంలేదన్నారు.

మరోవైపు, ఈ సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలను వినేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర వెూదీ చెప్పారన్నారు. ఏ అంశంపైనా చర్చకు సిద్ధమేనన్నారు.

ప్రపంచ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మన దేశం ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించాలన్నారని తెలిపారు. పార్లమెంట్‌లో ప్రజాస్వాబద్ధంగా ఆవెూదం పొందిన సీఏఏ విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర వెూదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రహ్లాద్‌ జోషీ, పలువురు సీనియర్‌ మంత్రులతో పాటు కాంగ్రెస్‌ నేతలు ఆనంద్‌ శర్మ, గులాం నబీ ఆజాద్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సుదీప్‌ బందోపాధ్యారు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కేకే, వైకాపా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శనివారం పార్లమెంట్‌లో బ్జడెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.