మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 నవంబరు 2019 (10:15 IST)

పవన్ కళ్యాణ్ హస్తినకు ఎందుకు వెళ్లారు? రహస్యమిదేనా?

నిజానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఏపీలో రాజకీయ చర్చకు దారితీసింది. ఆయన ఢిల్లీకి ఎందుకు ఢిల్లీ వెళ్లారు..? వ్యక్తిగత పనుల మీద ఢిల్లీ వెళ్లారా..? లేకుంటే ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడానికి వెళ్లారా..? అనే అంశంపై రాజకీయ నేతల్లో చర్చనీయాంశమైంది. 
 
ఢిల్లీలో పవన్‌కు ఎవరెవరి అపాయింట్‌మెంట్లు ఇచ్చారు..? అసలు భేటీ అయ్యారా లేదా..? అనే విషయంపై మాత్రం ఇప్పటికీ జనసేన వర్గాలు మౌనంగా ఉన్నాయి. అయితే కీలకమైన మంతనాలు జరిగాయని మాత్రం వార్తలు గుప్పుమంటున్నాయి. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలతో ఒకరిద్దరు కీలక నేతలను పవన్‌ కలుసుకుంటారనే ప్రచారం జరిగింది. మరి ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజం..? అనేది మాత్రం తెలియరాలేదు. వినపడుతున్నాయి.
  
ఈ నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటన ముగించుకున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌కు ఆయన వచ్చేశారు. అయితే పర్యటనకు సంబంధించి రేపు అనగా ఆదివారం ఉదయం లేదా మధ్యాహ్నం ప్రెస్‌మీట్ పెట్టి స్వయంగా పవనే వివరాలు వెల్లడిస్తారని సమాచారం. 
 
మరోవైపు పవన్ ఢిల్లీ పర్యటన గురించి పవన్ ఏం చెబుతారా...? అని జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు వేచి చూస్తున్నారు. మరి ప్రెస్‌మీట్ ఉంటుందో లేదో వేచి చూడాల్సిందే మరి.