1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 19 అక్టోబరు 2021 (10:02 IST)

ఆధారాలు అడ‌గ‌డం పోలీస్ వ్య‌వ‌స్థ చేత‌కానిత‌నం: జ‌వ‌హ‌ర్

దళిత నేత ఆనందబాబుకు నోటీసు ఇవ్వటం పోలీసుల బెదిరింపు చర్యే అని మాజీ మంత్రి, తెలుగుదేశం నాయ‌కుడు జ‌వ‌హ‌ర్ ఆరోపించారు. బెదిరింపులతో దళిత నాయకత్వాన్ని కట్టడి చేయలేర‌ని, అంబేద్కర్ వారసులుగా అక్రమాలను, దౌర్జన్యాలను ఎండగడతాం అన్నారు.
 
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోపణలు చేసిన వారిని ఆధారాలు అడగడం పోలీస్ వ్యవస్థ‌ చేతకానితనానికి  నిదర్శనం అని జ‌వ‌హ‌ర్ విమ‌ర్శించారు. పోలీసులు, దొంగలు ఒక్కటయ్యార‌ని, రాష్ట్రం మాదక ద్రవ్యాల అడ్డాగా మారింద‌ని ఆరోపించారు. పాలకులే అక్రమార్జనకు కేరాప్ అడ్రస్ గా మారార‌ని, నాటు సారా ఏరులై పారుతోంద‌ని, ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలయ్యాయ‌న్నారు. గంజాయి అని టైపు చేస్తే ఏ పి కనపడుతుంద‌ని జ‌వ‌హ‌ర్ పేర్కొన్నారు. 
 
సార రహిత జిల్లాలను నాటు సారా జిల్లాలుగా మార్చార‌ని, ఆబ్కారీ శాఖను ముక్కలు చేసి అక్రమార్జనకు అడ్డు తొలగించార‌ని, ఏ పి ని మాధక ద్రవ్య రాజధాని చేశార‌ని ఆరోపించారు. మీ చేతకానితనం మాకు శాపంగా మారింది... వేధింపులు ఆపకపోతే పరిణామాలకు బాధ్యత పోలీస్ లు వహించాల్సి ఉంటుంద‌ని మాజీ మంత్రి జవహర్ హెచ్చ‌రించారు.