సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (08:58 IST)

మీకూ - మీ సీఎంకూ అవగాహన లేదు... అమరావతి అభివృద్ధి అంటే ఇదేనా: జేసీ సెటైర్స్

అనంతపురం టీడీపీ ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతి అభివృద్ధి అంటే ఇదేనా అంటూ మండిపడ్డారు. పైగా, అమరావతి అభివృద్ధిపై మీకూ.. మీ ముఖ్యమంత్రికి ఏమాత్రం అవగా

అనంతపురం టీడీపీ ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతి అభివృద్ధి అంటే ఇదేనా అంటూ మండిపడ్డారు. పైగా, అమరావతి అభివృద్ధిపై మీకూ.. మీ ముఖ్యమంత్రికి ఏమాత్రం అవగాహన లేదనీ, ఇలాగైతే అమరావతి అభివృద్ధి ఎప్పటికీ సాధ్యమంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
కర్నూలు కార్పోరేషన్ కార్యాలయంలో మంత్రి నారాయణ, ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డితో ఎంజీ జేసీ దివాకర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణతో జేసీ మాట్లాడుతూ అమరావతి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు అవగాహన లేదని వ్యాఖ్యానించారు. 
 
అమరావతి అభివృద్ధి కావాలంటే ఎంపీలు, ఎమ్మెల్యేలకు బ్యాంకుతో టై-అప్ చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సూచించారు. కేవలం స్థలాలు మాత్రమే ఇస్తే.. ఎమ్మెల్యేలు ఆ స్థలాన్ని కొంత కాలం తర్వాత దొంగల్లా అమ్ముకుంటారన్నారు.
 
ప్రభుత్వ ఆఫీసర్లకు, సిబ్బందికి ఇళ్లు నిర్మించకుండా అమరావతి ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఇళ్లు కూడా ఒక్కొక్కరికి ఒక కిలోమీటర్ దూరంలో నిర్మించాలని ఆయన మంత్రికి సూచించారు. దీంతో ఎమ్మెల్యేల మధ్య గొడవల్లేకుండా ఉంటుందన్నారు. ఆ తర్వాత అక్కడే ఉన్న మీడియా మిత్రులను చూసి.. ఇదంతా ఆఫ్‌ ది రికార్డ్ అంటూ వ్యాఖ్యానించారు.