శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2016 (16:11 IST)

ఎవరా నట్టి కుమార్... నాకు తెలియదు.. విచారణ జరిపించుకోవచ్చు : అచ్చెన్నాయుడు

తనపై అసత్య ఆరోపణలు చేసిన సినీ నిర్మాత నట్టి కుమార్‌కు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. అసలు నట్టి కుమార్ ఎవరో తనకు తెలియదని తేల్చి పారేశారు.

తనపై అసత్య ఆరోపణలు చేసిన సినీ నిర్మాత నట్టి కుమార్‌కు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. అసలు నట్టి కుమార్ ఎవరో తనకు తెలియదని తేల్చి పారేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు మంత్రులు, అధికారులకు గ్యాంగ్ స్టర్ నయీంతో సంబంధాలున్నాయని తాను మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లానని, అయితే ఆయన నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదని నట్టి కుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
 
ఈ ఆరోపణలపై మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడలో స్పందించారు. నట్టి కుమార్ ఎవరో తనకు తెలియదని, తన జీవితంలో అలాంటి వ్యక్తిని కలిసిన గుర్తు లేదని చెప్పుకొచ్చారు. తనపై ఆరోపణలు చేస్తున్న నట్టి కుమార్ లేదా ఇంకెవరైనా విచారణ జరిపించుకోవచ్చని ఆయన సవాల్ విసిరారు. నట్టి కుమార్ చెబుతున్న విషయాలు తన దృష్టికి రాలేదని తేల్చి చెప్పారు.