గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 నవంబరు 2024 (19:55 IST)

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

Eggs
మహిళలూ వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా? రోజూ కోడిగుడ్డును ఆహారంలో భాగం చేసుకోవాలని ఓ అధ్యయనంలో వెల్లడి అయ్యింది. కోడిగుడ్లలో అధిక స్థాయిలో ప్రోటీన్లు వుండటంతో మెదడు పనితీరు మెరుగవుతుందని కాలిఫోర్నియా శాన్ డియాగో విశ్వవిద్యాలయం బృందం తెలిపింది. 
 
55 ఏళ్లు పైబడిన 890 మందిపై జరిగిన అధ్యయనంలో కోడి గుడ్డు వినియోగంతో మెదడు పనితీరు మెరుగైన విషయాన్ని గమనించారు. న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ఈ అధ్యయనం ఫలితాలు వెలువడ్డాయి. ఎక్కువ గుడ్లు తిన్న స్త్రీల మెదడు పనితీరు మెరుగ్గా వుంటుంది. వీరిలో మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్‌కు సహాయపడే కోలిన్ వల్ల గుడ్లలో వుండటం ఇది సాధ్యమైందని తెలిసింది. 
 
కోడిగుడ్లలో బీ6, బీ12, ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్లు కూడా ఉంటాయి. ఇవి మెదడు కుంచించుకుపోవడాన్ని నిరోధిస్తాయి. గుడ్లలో అధిక-నాణ్యతతో కూడిన ప్రోటీన్, విటమిన్ బీ12, ఫాస్పరస్, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. గుడ్లలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి12, సెలీనియం రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకమని పరిశోధన తేల్చింది.