బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

15-11-2024 శుక్రవారం ఫలితాలు - ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు...

astro4
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు, పత్రాల్లో మార్పులు సాధ్యమవుతాయి. వనసమారాధనలో. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2, పాదాలు
ఉత్సాహంగా అడుగులేయండి. మీ కృషి ఫలిస్తుంది. ముఖ్యుమైన పనులు వేగవంతమవుతాయి. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
యత్నాలు కొనసాగించండి. అనుమానాలకు తావివ్వవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. దైవదీక్షలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. అకాలభోజనం, విశ్రాంతిలోపం. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆహ్వానం అందుకుంటారు. ప్రయాణం తలపెడతారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ధైర్యంగా యత్నాలు సాగించండి. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. అనవసర జోక్యం తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. వాహనదారులకు దూకుడు తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆశయం సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థిక లావాదేవీలు కొలిక్కివస్తాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. ఖర్చులు సామాన్యం. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. అపరిచితులతో మితంగా సంభాషించండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఖర్చులు అధికం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. పిల్లల దూకుడు అదుపు చేయండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సమర్థతను చాటుకుంటారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కీలక పత్రాలు అందుకుంటారు. పిల్లల యత్నం ఫలిస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఓర్పుతో మెలగండి. కష్టసమయంలో ఆప్తులు ఆదుకుంటారు. ఆందోళన కలిగించి సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు అధికం. పనుల్లో శ్రమ ఒత్తిడి అధికం. ఊహించని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. బంధువుల రాకతో గృహం సందడిగా ఉంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పనులు సానుకూలమవుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.