బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

13-11-2024 బుధవారం ఫలితాలు - కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి....

astro2
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. సంప్రదింపులతో తీరిక ఉండదు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ సమస్యలు తొలగుతాయి. తాకట్టు విడిపించుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఖర్చులు అంచనాలను మించుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. పాత పరిచయస్తులు తారసపడతారు. వ్యవహారాల్లో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా పాటించండి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. సన్నిహితులతో సంభాషిస్తారు. పనులు, అప్పగించవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. మీ కష్టం ఫలించదు. అందరితోనూమితంగా సంభాషించండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అననవసర విషయాల్లో జోక్యం తగదు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ ప్రభావం చూపుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. దంపతుల మధ్య సఖ్యతలోపం. సన్నిహితులతో సంభాషిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారపరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. ధనలాభం ఉంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. బంధుత్వాలు బలపడతాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. పనులు వాయిదా వేసుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ముఖ్యమైన పనులతో తీరిక ఉండదు. ఖర్చులు విపరీతం. వ్యవహారాలతో తీరిక ఉండదు. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. ఒక ఆహ్వానం సందిగ్గానికి గురిచేస్తుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. కష్టించినా ఫలితం అంతంత మాత్రమే. సమర్ధతకు గుర్తింపు ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. కీలక వ్యవహారాలతో తీరిక ఉండదు. పట్టుదలకు పోయి అవకాశాలను చేజార్చుకుంటారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆందోళన కలిగించిన సద్దుమణుగుతుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఓర్పుతో యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆలయాలు, సేవాసంస్థలకు విరాళాలు అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు.