సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

12-11-2024 మంగళవారం ఫలితాలు - మీ వాక్కు ఫలిస్తుంది.. మాట నిలబెట్టుకుంటారు...

astro1
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
పొదుపు ధనం అందుకుంటారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు పురమాయించవద్దు. గృహమార్పు కలిసివస్తుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
విజ్ఞతతో వ్యవహరిస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్లు వదిలేయండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆచితూచి వ్యవహరించాలి. అందరితోనూ మితంగా సంభాషించండి. పనులు ఒక పట్టాన సాగవు. దుబారా ఖర్చులు విపరీతం. ఉంది. లావాదేవీలతో తీరిక ఉండదు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆదాయం బాగుంటుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. బంధుమిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులతో సతమతమవుతారు. సోదరులతో సమస్యలెదురవుతాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో వ్యవహరించండి. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహాన్నిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పిల్లల దూకుడు కట్టడి చేయండి. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పెద్దలను సంప్రదిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వనసమారాధనలో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యసాధనలో సఫలీకృతులవుతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు సానుకూలమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. మీ కృషి ఫలిస్తుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. కీలక చర్చల్లో పాల్గొంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సన్నిహితుల సలహా పాటించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. అందరితోను సౌమ్యంగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఖర్చులు సామాన్యం. పనులు ఒక పట్టాన సాగవు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీల్లో తప్పటడుగు వేస్తారు. ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ వాక్కు ఫలిస్తుంది. పరిచయాలు బలపడతాయి, మాట నిలబెట్టుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ప్రయాణంలో కొత్తవారితో మితంగా సంభాషించండి.