శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-11-2024 గురువారం రాశిఫలాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Karkatam
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. ధనలాభం ఉంది. ఆపన్నులకు సాయం అందిస్తారు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. కుటుంబ సౌఖ్యం పొందుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ప్రయాణం విరమించుకుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. దూరపు బంధుత్వాలు బలపడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. పనులు అనుకున్న విధంగా సాగవు. ఊహించని ఖర్చులెదురవుతాయి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ధపలాభం ఉంది. చెల్లింపుల్లో జాగ్రత్త. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు సానుకూలమవుతాయి. అనవసర జోక్యం తగదు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికలావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు నెరవేరవు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. యత్నాలకు అదృష్టం కలిసివస్తుంది. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అభియోగాలను ధీటుగా ఎదుర్కుంటారు. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. పాతమిత్రులు తారసపడతారు. విందులకు హాజరవుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీల్లో తప్పటడుగు వేస్తారు. అన్యమస్కంగా గడుపుతారు. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు. ఖర్చులు అధికం. ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. ఎవరినీ కించపరచవద్దు. ఆత్మీయులను కలుసుకుంటారు స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులకు చేరువవుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులతో జాగ్రత్త. పొగిడేవారి ఆంతర్యం గ్రహించండి. పనులు చురుకుగా సాగుతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వాహన సౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. దుబారా ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు.