శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 2 నవంబరు 2024 (23:55 IST)

03-11-2024 ఆదివారం ఫలితాలు-రుణసమస్యలు తొలగుతాయి

Debits
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పరిచయాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణసమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. విమర్శలను దీటుగా ఎదుర్కుంటారు. మీ విజ్ఞతకు ప్రశంసలు లభిస్తాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు ధనసహాయం అందిస్తారు. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. ముఖ్యులతో పరిచయాలేర్పడతాయి. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పనులు సానుకూలమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఓర్పుతో యత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం. ఆప్తులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కొంతమేరకు అనుకూలమే. పరిస్థితులు చక్కబడతాయి. వ్మూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషికి కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. పత్రాలు అందుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. మీ జోక్యం అనివార్యం. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ప్రముఖులకు సన్నిహితులవుతారు. పనులు, పురమాయించవద్దు. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రముఖులకు చేరువవుతారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఉత్సాహంగా యత్నాలు మెలగండి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దైవకార్యంలో పాల్గొంటారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు వేగవంతమవుతాయి. అవకాశాలలు కలిసివస్తాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఖర్చులు విపరీతం. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఆరోగ్యం జాగ్రత్త. అనవసర జోక్యం తగదు. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. వేడుకకు హాజరుకాలేరు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. రావలసిన ధనం అందుతుంది. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ చిత్తశుద్ధిని కొంతమంది శంకిస్తారు. మనోధైర్యంతో మెలగండి.