బుధవారం, 6 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

31-10- 2024 గురువారం దినఫలితాలు - నిర్దిష్ట పథకాలతో ముందుకు సాగుతారు...

astrolgy
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
నిర్దిష్ట పథకాలతో ముందుకు సాగుతారు. పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. సంతానానికి శుభం జరుగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. పనుల సానుకూలమవుతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ధనలాభం ఉంది. అయిన వారి కోసం వ్యయం చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. విందులకు హాజరవుతారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పనులు, కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పట్టుదలతో యత్నాలు సాగించండి. చేస్తున్న పనులు మధ్యలో అపివేయవద్దు. స్నేహసంబంధాలు విస్తరిస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు విపరీతం. కొన్ని వ్యవహారాలు అనుకూల ఫలితాలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మీదైన రంగంలో మంచి ఫలితాలున్నాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఖర్చులు విపరీతం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగి విషయాలు వెల్లడించవద్దు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు వదులుకోవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపుల్లో జాగ్రత్త. ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. పిల్లల అత్యుత్సాహం అదుపుచేయండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. విందుల్లో పాల్గొంటారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. అవకాశాలను వదులుకోవద్దు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. అపజయాలకు కుంగిపోవద్దు. దంపతుల మధ్య అకారణ కలహం. బంధువుల వైఖరి కష్టమనిపిస్తుంది. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. దుబారా ఖర్చులు విపరీతం. పత్రాలు అందుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రకటనలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక్త పెంపొందుతుంది, దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలు ముగుస్తాయి. రావలసిన ధనం అందుతుంది. కుటుంబీకుల కోసం వ్యయం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి, అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. విందులు, వేడకకు హాజరవుతారు.