సోమవారం, 28 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

26-10-2024 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు...

astro8
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఓర్పుతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య అకారణ కలహం. స్థిమితంగా ఉండండి. ఆప్తులతో సంభాషిస్తారు. ఇంటి విషయాల్లో అలక్ష్యం తగదు. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2, పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. మీ పట్టుదలే విజయానికి సంకేతం. ప్రణాళికలు వేసుకుంటారు. ధనసహాయం తగదు. అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు విపరీతం. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులకు చేరువవుతారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఖర్చులు అధికం. చేతిలో ధనం నిలడదు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అందరితోను మితంగా సంభాషించండి. పాతమిత్రులు తారసపడతారు. ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మానసికంగా స్థిమితపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ శ్రీమతి ప్రోత్సాహం ఉంటుంది. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. గృహ మరమ్మతులు చేపడతారు. నగదు, కీలక పత్రాలు జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఉల్లాసంగా గడుపుతారు. కీలక పత్రాలు అందుతాయి. పనులు చురుకుగా సాగుతాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పనిభారం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లౌక్యంగా మెలగండి. పంతాలకు పోతే ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ధనలాభం ఉంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు పురమాయించవద్దు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఖర్చులు విపరీతం. ధనసహాయం తగదు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారానుకూలత ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొగిడే వారితో జాగ్రత్త. పనులు అనుకున్న విధంగా సాగవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతలపై దృష్టి పెట్టండి.