సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-10-2024 గురువారం దినఫలితాలు - అవకాశాలను వదులుకోవద్దు...

astro6
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టిసారిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ధనప్రలోభాలకు లొంగవద్దు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలకు సన్నిహితులు సహకరిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు సామాన్యం. అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అభీష్టసిద్ధికి ఓర్పుతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. ధనం మితంగా వ్యయం చేయండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంభాషిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కొత్త పనులు ప్రారంభిస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు సామాన్యం. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు పనిభారం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆచితూచి వ్యవహరించాలి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల కలయిక వీలుపడదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అపోహలకు తావివ్వవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ముఖ్యమైన కార్యక్రమాలతో తలమునకలవుతారు. శ్రమాధిక్యత, అకాలభోజనం. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. పరిచయాలు బలపడతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. పట్టుదలకు పోవద్దు. కీలక చర్చల్లో పాల్గొంటారు. దూరప్రయాణం తలపెడతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
గృహమరమ్మలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఖర్చులు అధికం. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయలు తీసుకుంటారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చిన్న విషయానికే చికాకుపడతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. దుబారా ఖర్చులు అధికం. పనులు హడావుడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు సామాన్యం. ధనసాయం తగదు. వ్యవహారాలతో తలమునకలవుతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి.