సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

23-10-2024 బుధవారం దినఫలితాలు - గృహం ప్రశాంతంగా ఉంటుంది...

astro5
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు. చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. పరిచయాలు బలపడతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. తక్షణం వాయిదాలు చెల్లించండి. పనులు అప్పగించవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సర్వత్రా ప్రోత్సాహకరం. మాటతీరుతో అందరినీ కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. పెద్దలను సంప్రదించండి. ప్రయాణం తలపెడతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కీలక పత్రాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పిల్లల విదేశీ చదువులపై దృష్టి పెడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులకు పనిభారం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. చీటికిమాటికి అసహనం చెందుతారు. అతిగా ఆలోచింపవద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనులు పురమాయించవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పాతమిత్రులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాను స్పష్టంగా తెలియజేయండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పనులు వేగవంతమవుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యసిద్ధికి చిత్తశుద్ధితో శ్రమించాలి. ఖర్చులు అధికం. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు సాగవు. చీటికిమాటికి చికాకుపడతారు. స్థిమితంగా ఉండండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. నోటీసులు అందుకుంటారు. మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అందరితోను మితంగా సంభాషించండి. విమర్శలు పట్టించుకోవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
బాధ్యతలు అప్పగించవద్దు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు చేపడతారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.