సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-10- 2024 ఆదివారం దినఫలితాలు : ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి...

astro3
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు అధికం. పెట్టుబడులు కలిసిరావు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పనులు వేగవంతమవుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అనుకున్నది సాధిస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సహాయం ఆశించవద్దు. పనులు ప్రారంభంలో అవాంతరాలు ఎదురవుతాయి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ కష్టం ఫలిస్తుంది. పదవులు స్వీకరిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. బాకీలను లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. వ్యవహారానుకూలత ఉంది.. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు అధికం. గృహమరమ్మతులు చేపడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మీ వాక్కు ఫలిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. సంతానం కృషి ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆత్మీయుల ఆహ్వానం ఉల్లాసాన్నిస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. స్థల వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. పరిచయాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విమర్శలను ధీటుగా ఎదుర్కుంటారు. మీ చిత్తశుద్ధికి ప్రశంసలు లభిస్తాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు సహాయ సహకారాలు అందిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీ ఓర్పునకు పరీక్షాసమయం. లక్ష్యసిద్ధికి మరింత శ్రమించాలి. పనులు ఒకపట్టాన సాగవు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. ఆప్తులతో సంభాషిస్తారు. దైవకార్యంలో పాల్గొంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. మీ జోక్యం అనివార్యం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. కుటుంబ సౌఖ్యం పొందుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోండి. పనులు పురమాయించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఆరోగ్యం జాగ్రత్త. అనవసర విషయాల్లో జోక్యం తగదు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. నోటీసులు అందుకుంటారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. పనులు సానుకూలమవుతాయి. మీ చిత్తశుద్ధిని కొంతమంది శంకిస్తారు. మనోధైర్యంతో మెలగండి.