శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

17-10-2024 గురువారం రాశి ఫలితాలు- నిరుత్సాహం వీడితే..?

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పెద్దలతో సంభాషిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. నోటీసులు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీలు పురోగతిన సాగుతాయి. ఒక సమస్య సానుకూలమవుతుంది. మానసికంగా స్థిమితపడతారు. ఒక వార్త సంతోషాన్నిస్తుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. సంతానం దూకుడు అదుపు చేయండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు చురుకుగా సాగుతాయి. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం గ్రహిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంభాషిస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆప్తుల కలయిక వీలుపడదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు విపరీతం. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
నిరుత్సాహం వీడియత్నాలు సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. సంతానం విజయం ఉపశమనం కలిగిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటిస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
దంపతుల మధ్య సఖ్యత లోపం. సామరస్యంగా మెలగండి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు సామాన్యం. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వేడుకకు హాజరవుతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. బేషజాలకు పోవద్దు. పెద్దల సలహా తీసుకోండి. పత్రాలు అందుకుంటారు. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. వ్యాపారాలు, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆత్మస్థైర్యంతో అడుగులేస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మీ నమ్మకం వమ్ముకాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఖర్చులు అధికం. దూరప్రయాణం తలపెడతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చేపట్టిన పనులు చివరి క్షణంలో పూర్తవుతాయి, ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.