బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

14-10-2024 సోమవారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

astro3
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఓర్పుతో యత్నాలు సాగించండి. సంప్రదింపులు వాయిదా పడతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మందకొడిగా సాగుతాయి. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు సామాన్యం. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆరోగ్యం మందగిస్తుంది.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు బలపడతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆశావహదృక్పథంతో మెలగండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గృహమరమ్మతులు చేపడతారు. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
దంపతుల మధ్య సఖ్యతలోపం. ఆలోచనలతో సతమతమవుతారు. సంప్రదింపులు ఫలించవు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. మీ జోక్యం అనివార్యం. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి విలువైన వస్తువులు జాగ్రత్త. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. బాధ్యతలు, దీక్షలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. బంధువులను కలుసుకుంటారు. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. వ్యాపారాలు సామాస్యంగా సాగుతాయి. పత్రాల రెన్యువల్‌ను అలక్ష్యం చేయకండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఒక సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మాట నిలబెట్టుకుంటారు. మీ వ్యక్తిత్వం ఆకట్టుకుంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఖర్చులు విపరీతం. బంధుమిత్రులను కలుసుకుంటారు. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. వివాదాలు కొలిక్కివస్తాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్ధికలావాదేవీలతో తీరిక ఉండదు. కొత్త సమస్యలెదురవుతాయి. పెద్దల వ్యాఖ్యలు మీపై సత్ ప్రభావం చూపుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఆత్మీయులరాక ఉపశమనం కలిగిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. ఆహ్వానం అందుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.