గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

శనివారం నాడు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయి?

astro1
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం 
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. నూత వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. మిమ్ములను తక్కువ అంచనా వేసుకోవద్దు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు సంతృప్తికరం. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో వ్యవహరించండి. అపోహలకు తావివ్వవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు భారమనిపించవు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో సంభాషిస్తారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
అనుకున్నది సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆది, పనులు వేగవంతమవుతాయి. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలెదుర్కుంటారు. పనులు పురమాయించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ముగుస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పనులు ఒక పట్టాన సాగవు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వేడుకకు హాజరవుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమర్థతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి మంచి జరుగుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. మీనిర్ణయం సత్ఫలితమిస్తుంది. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు విపరీతం అదపులో ఉండవు. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. విమర్శలు పట్టించుకోవద్దు. సన్నిహితులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. ఖర్చులు ప్రయోజనకరం. పనులు చురుకుగా సాగుతాయి. బంధువులతో సంభాషిస్తారు. దైవ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. అందరిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
శుభవార్త వింటారు. యత్నం ఫలిస్తుంది. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.