బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By ఠాగూర్

07-10-2024 సోమవారం దినఫలితాలు - ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం...

Capricorn
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనుకున్నవిధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. మీ జోక్యం అనివార్యం. ధనలాభం ఉంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
రుణ సమస్యలు తొలగుతాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పట్టుదలతో యత్నాలు సాగించండి. రావలసిన ధనం అందదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలతో తీరిక ఉండదు. అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. పెద్దల సలహా తీసుకోండి. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు అధికం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
యత్నాలకు అదృష్టం కలిసివస్తుంది. మీ నమ్మకం వమ్ముకాదు. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు పురమాయించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. లావాదేవీలు ముగుస్తాయి. ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొత్త విషయాలు తెలుసుకుంటారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాగ్రత్త. ఆప్తుల కలయిక వీలుపడదు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. సోదరులను సంప్రదిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆశావహదృక్పథంతో అడుగులేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ కష్టం వృధాకాదు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు భారమనిపించవు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీల్లో తప్పటడుగు వేస్తారు. కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ప్రియతములతో కాలక్షేపం చేయండి. దుబారా ఖర్చులు విపరీతం. ఉపాధి పథకాలు చేపడతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకున్నది సాధిస్తారు. పనులు సానుకూలమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ప్రయాణంలో అపరిచితులతో మితంగా సంభాషించండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. సంతానం కృషి ఫలిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్ధికలావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానానికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. హోల్సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి.