బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

04-10-2024 శుక్రవారం దినఫలితాలు : కలిసివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోండి...

Virgo
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కలిసివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోండి. డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వవద్దు. కొందరి వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. పెద్దల సలహా పాటించండి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లు, షాపు పనివారలతో జాగ్రత్త.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లక్ష్యం నెరవేరుతుంది. మానసికంగా స్థిమితపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. తలపెట్టిన పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు విపరీతం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. వాక్‌పటిమతో నెట్టుకొస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. బంధువులతో సంభాషిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు విపరీతం. పనులు సానుకూలమవుతాయి. కీలకపత్రాలు జాగ్రత్త. పిల్లల దూకుడు కట్టడి చేయండి. వేడుకకు హాజరవుతారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఆప్తులతో సంభాషిస్తారు. పనులు సాగవు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వాహనదారులకు అత్యుత్సాహం తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. సోదరులతో సంభాషిస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతంగా ముగిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహిచండి. ఉపాధి పథకాలు చేపడతారు. వివాదాలు మలుపు తిరుగుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే చికాకుపడతారు. వ్యవహారాలు వాయిదా వేయటం శ్రేయస్కరం. వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహపరుస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్భాటాలకు పోవద్దు. ఖర్చులు తగ్గించుకోండి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఆహ్వాన, వీడ్కోలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనులు అనుకున్న విధంగా సాగవు. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఖర్చులు అదుపులో ఉండవు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఓర్పుతో యత్నాలు సాగించండి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. పనులు, కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉపాధ్యాయులకు పనిభారం. వేడుకలు, విందులకు హాజరవుతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
రుణసమస్య నుంచి విముక్తులవుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొత్త పరిచయాలేర్పడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. పనులు ఒక పట్టాన సాగవు వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ముఖ్యం. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.