బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2024 (10:45 IST)

30-09-2024 సోమవారం దినఫలితాలు : నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం...

Taurus
మేషం :- ఆపద సమయంలో మిత్రులు అండగా నిలబడతారు. స్త్రీలు పట్టుదలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగవలసి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. బ్యాంకింగ్, ఫైనాన్సు, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
వృషభం :- కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో చికాకులు తప్పవు. ఆత్మీయులకు మీ సమస్యలు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉంది. పెద్దల ఆరోగ్య, ఆహార వ్యవహారాలలో మెళుకువ అవసరం. రాజకీయాలలో వారికి విరోధుల వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. బంధుమిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు.
 
మిథునం :- దంపతుల మధ్య కలహాలు అధికమువుతాయి. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు వాయిదా పడతాయి. రాజకీయాల వారికి పార్టీపరంగాను, అన్నివిధాలా కలిసివస్తుంది. వృత్తి ఉద్యోగములందు ఆదాయం బాగుంటుంది. 
 
కర్కాటకం :- ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం అధికమవుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. బ్యాంకు వ్యావహారాల్లో మెళుకువ, ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు హోదా పెరగటంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి. రవాణా రంగాలలో వారికి శ్రమకు తగిన ఫలితం కానవస్తుంది.
 
సింహం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం.
 
కన్య :- రాబడికి మించి ఖర్చులు అధికమవుతాయి. తలపెట్టిన పనుల్లో ఒడిదుడుకులను ఎదుర్కుంటారు. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కుంటారు. బంధు మిత్రులలో మంచి గుర్తింపు, రాణింపులభిస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గనించండి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
తుల :- ఉపాధ్యాయులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచటం క్షేమదాయకం. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలు దార్లను ఆకట్టుకుంటారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు.
 
వృశ్చికం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. విద్యార్థులు స్వయం కృషితో బాగా రాణిస్తారు. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు అధికారులతో సమన్వయం లోపిస్తుంది. మీ కళత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఖర్చులు మీ ఆదాయానికి తగినట్లుగానే ఉంటాయి.
 
ధనస్సు :- రాజకీయాలలో వారికి విరోధుల వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఒత్తిడి, చికాకులు తప్పవు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. బంధువులతో చిన్న చిన్న కలహాలు జరిగే ఆస్కారం ఉంది. కొబ్బరి, కూరలు, పండ్లు, పూల వ్యాపారస్థులకు సంతృప్తికరంగా ఉంటుంది.
 
మకరం :- స్టేషనరీ, ప్రింటింగు రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో చురుకుదనం కానవస్తుంది. స్త్రీలకు నూతన సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. క్రయ విక్రయ రంగాలలోని వారికి సంతృప్తికనవస్తుంది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
కుంభం :- ఆర్థిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. తలపెట్టిన పనిలో సంతృప్తి, జయం చేకూరగలదు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. స్త్రీలు అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించడం మంచిది. విదేశాల్లోని ఆత్మీయులకు ప్రియమైన వస్తుసామగ్రిని అందజేస్తారు.
 
మీనం :- ఆర్థిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థల్లో వారు మార్పులకై చేయుయత్నాల్లో సఫలీకృతులౌతారు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. రిప్రజెంటేటివ్‌లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది.